నిన్ను కలిసి చాలా రోజులయింది.ఒకసారి కలవాలని ఉంది.నీకు అభ్యంతరంలేకపోతే .....అసంపూర్తిగా మాట్లాడి ఆగాడు చక్రధర్ సంతోషితో."నాకేం అభ్యంతరం లేదు"అన్నది సంతోషి ఫోన్లో అవతలనుంచి.
సంతోషి ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపాడు చక్రధర్..అక్కడే వెయిట్ చేస్తున్న సంతోషి వచ్చి కారులో కూర్చుంది.
నిన్నిలా పిలవటం ,మాట్లాడాలనుకోవడం తప్పే అయినా నా కెందుకో.............. "అన్నాడు నిరాశగా?
"ఇట్లా అన్నీ తప్పు అనుకుంటే తప్పే మనమేం తప్పు చెయ్యలేదుగా?"
అన్నది సంతోషి.
ఏంటి అసలు. ఎలా ఉన్నావు?నేను కూడా ఈ మధ్య ఒకసారి నిన్ను తలుచుకున్నా"అన్నది సంతోషి.
పెళ్ళి తరువాత జీవితం అందంగా ఉండడం అదృష్టం మీద ఉంటుంది ,నువ్వు ఒప్పుకుంటావా?"అడిగాడు చక్రధర్.
ఒప్పుకుంటా .ఎందుకంటే ఈ అదృష్టమే మంచి బుద్ధి ని మనిషికి ఇచ్చేది."అన్నది సంతోషి.
మంచి బుద్ధీ అంటే"అన్నాడు.
"అంటే,అంటే ఒకళ్ళకి ఒకటి ఇష్టం మరొకరికి మరోటి......అసలు .ఇష్టం లేకపోయినా తృప్తి పరచటం.అహాన్ని తృప్తి పరచటం .అర్థం చేసుకుంటు స్పందించటం,ఏ టైం,ఏ సందర్భం అన్న ఇంగితం,బలహీనతల్ని క్షమించటం ఇవన్నీ బుద్ధి కోవలోకే కదా వచ్చేది"అన్నది సంతోషి.
1 comments:
ఎందుకిలా ??????????
Post a Comment