Search This Blog

Loading...

Friday, March 19, 2010

49

ఇంటికి వెళ్తూ దారిలో మెకానిక్ ని కలుద్దామని గ్యారేజ్ బయట ఆపాడు చక్రధర్.మెకానిక్ ఏదో హడావుడిలో ఉన్నాడు.గ్లాస్ క్రిందికి పోనిచ్చి వంగి మాట్లాడాడు.ఊరెళ్తున్నా సార్ "అన్నాడు మెకానిక్.దేనికి "అడిగాడు చక్రధర్."మా వదిన రాత్రి................"చెప్పాడు మెకానిక్.
అరరే,ఎందుకు"చక్రధర్.అడిగాడు.
ఏమో సార్ తెలియదు"
సరె వెళ్ళాక ఫోన్ చెయ్ నాకు"
సరె సార్".
చక్రధర్ మేడ మీద అటు ఇటు నడుస్తున్నాడు ఇంటికి వచ్చాక..తనకి మూడ్ అంతా పాడైపోయింది మెకానిక్ మాట విన్నాక.
చాలా చాలా దిగులు.ఏదో నిరాశ.ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్.తన ఆనందం ఎందుకిలా అప్పుడప్పుడు మాయమైపోతుంది? నేనేం తప్పు చేశా ?అన్యాయం చేశా.?ఎవరికి? ప్రశ్నలు..... మనసులో.బాధని దిగమ్రింగుకుంటున్నాడు.....మనసులో మెకానిక్ అతని వదిన గురించ్ చెప్పిన వార్త బాగా భయానికి గురిచేసింది.తనకేదో అయిపోతుందని కాదు.తన వల్ల ఎవరికైనా అవుతుందనా ?ఏమో .
ఆకలి లేదు ,నిద్ర పట్టలా.నెమ్మదిగా దివ్య ని లేపాడు.కళ్ళనిండా నీళ్ళు."ఏమైంది "అడిగింది.
ఏమో అదే తెలియట్లా"చెప్పాడు.
కాసేపు బయట తిరగమన్నది .తనూ మెట్ల మీద కూర్చుంది తను తిరుగుతూ ఉంటే.

0 comments: