హాస్పిటల్ లో డాక్టర్ చాంబర్ లో ఇద్దరూ కూర్చున్నారు.
సార్ నిన్న ఈవెనింగ్ మేడ మీద నడుస్తున్నప్పుడు నా అడుగులు ఒక పటం అది దేవుడిది ,దాని మీద పడుతున్నట్లు అనిపించింది.అసలు అది ఎంత తప్పు.దేవుడి మీద నడవడమా?చ.ఎంత పాపం .నన్ను క్షమిస్తాడా దేవుడు."చెప్తున్నాడు చక్రధర్ డాక్టర్తో.
అంతకుముందు ఏం జరిగింది.నిన్న ఉదయం ,మొన్న ఏదైనా ఇష్టం లేని సంఘటన జరిగిందా?అడిగారు డాక్టర్.
చెప్పటానికి అలోచిస్తున్నాడు చక్రధర్.
ఇంకా అడిగి తెలిసికునేంత ఓర్పు డాక్టర్ ప్రదర్శించలేదు.బయట ఇంకా చాలా మంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు.
ప్రిస్క్రిప్షన్ వ్రాయడం పూర్తి చేశాడు డాక్టర్.
0 comments:
Post a Comment