Search This Blog

Loading...

Thursday, March 18, 2010

48

అన్నది.
ఉంటావా నాలుగు రోజులు?అడిగాడు.
లేదు వెళ్ళాలి రేపు.నేను లేకపోతే ఇంక నిద్ర కూడా పోడు ఆయన." అన్నది.
గొప్ప భార్యా భర్తలు" అన్నాడు చక్రధర్.
అదే అనలేదేంటా ఇంకా అని చూస్తున్నా.ఏం ఎగతాళా?"కోపంగా అడిగింది.
అబ్బే ఊరికే అలా అన్నాను "చక్రధర్.అన్నాడు.
నన్ను కలిసిన విషయం చెప్పు .దాపరికం అపార్థాలకు దారి తీస్తుంది.."అన్నాడు మళ్ళీ చక్రధర్.
అహా ఎంత బాగా చెప్పావయ్యా.అసలు నీకేం తెలుసు అని ఆయన గురించి."అన్నది సంతోషి.
అట్లా అయితే ఇంకోసారి పిలవన్లే" చెప్పాడు చక్రధర్.
అంత భయం.నాయనో ! ఎక్కడా చూడ్లా నీలాంటి మనిషిని" "అన్నది .
నాకిప్పుడు చాలా హాయిగా ఉంది నీతో మాట్లాడాక .
ఏదో కాస్త జస్ట్ చేంజ్ "అన్నాడు చక్రధర్.
అక్కడుండాలి చేంజ్ ఇక్కడ కాదు.ఇదేం పర్మెనెంట్ కాదు."చెప్పింది సంతోషి.

0 comments: