నేనిలా నిన్ను రమ్మనటం,కలవటం తప్పేమో కదా సంతోషీ? 'అడిగాడు చక్రధర్.
అబ్బబ్బ పాడిందే పాట పాచిపళ్ళ......ఏదో అన్నట్టు,ఎన్నిసార్లు అంటావు ఆ మాట.అంతమాత్రానికి కలవటమెందుకు?"అన్నది సంతోషి.
చిన్న నవ్వు నవ్వాడు చక్రధర్.
సరే నీ కెలా ఉంది ఇంట్లో మీ వారు పిల్లలు అంతా బాగున్నారా?"అడిగాడు.
బాగంటే అదే బాగు .ఎన్నాళ్ళైనా ఇంతే ఇంతకన్న ఎక్కువేమీ ఉండదు."అన్నది.
నువ్వు చెప్పావే ఆ విషయంలో ఏమన్నా మార్పు వచ్చిందా అతనిలో?"అన్నాడు.
నాకంత అదృష్టం కూడానా.ఏమీ మార్పు లేదు."అన్నది
పాపం చిన్న వయసే నీది"చక్రధర్ అన్నాడు.
సరే నీ సానుభూతి నాకఖ్ఖర్లేదు కానీ ఏంటి పిలిచావు ."అడిగింది.
ఈ మధ్య నేను మరింత బాధ పడుతున్నా.నా రోగం ఇంకా ఎక్కువైనట్టుంది."అన్నాడు.
అదేంలేదు కానీ ,ఖాళీ గా ఉండకుండా నీకు బాగా ఇష్టమైన దాని మీద మనసు పెట్టు. ఆమె గురించి అలోచించటం తగ్గించు.పాపం ఆమె చాలా మంచిది లాగుంది.
0 comments:
Post a Comment