మనకి ముఖ్యమైన వాళ్ళు అయితే ,
ఎదుటి వ్యక్తి కి కోపం వచ్చింది అన్న సందర్భంలో ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని అందుకు తగ్గట్లు గా ప్రవర్తిస్తాం.విషయాన్ని సెటిల్ చేసుకుంటాం. ,,,ఇది మామూలు గా జరుగుతుంది.అయితే కొంత మంది ఏమీ జరగలేదు అంతా మామూలు గా నే ఉంది అన్నట్లు తమని తాము నమ్మించుకుంటారు.లేదా ఎదుటి వ్యక్తి కోపాన్ని గమనించరు.వీళ్ళ ధోరణి లో వీళ్ళు ప్రవర్తిస్తుంటారు.అప్పుడు కోపంతో ఉన్న వ్యక్తి తన కోపం గుర్తింపబడలేదని,పరిష్కారం దిశగా ఎదుటి వ్యక్తి అలోచించటం లేదని ఇంకా ఎక్కువ ,మరింత కోపానికి లోనౌ తాడు.సమస్య మరింత జటిలమౌతుంది.ఏదో జరిగింది అని గ్రహిస్తే చర్చించుకుని పరిష్కారం కనుక్కొని ఆనందంగా గడపొచ్చు".
తీవ్రంగా కలత చెంది ఆలోచిస్తున్నాడు చక్రధర్.
0 comments:
Post a Comment