మ్యారేజి బ్యూరో బోర్డ్ చూసిన ప్రతి సారీ వెళ్ళాలని అడగాలని .ఏమని అడగాలి? ఎందుకు అంటే ఎం చెప్పాలి? విషయం దివ్య దాకా వెళ్తే మరిన్ని సమస్యలు అనుకున్నాడు చక్రధర్.
ఒక భార్య గా కాదు ఒక తోడుగా .సరదాగా కబుర్లు చెప్పుకోడానికి. ఒక స్త్రీ ,ఒక భార్య కావాలి.
మగ వాళ్ళు తోడుగా ఉంటే? ఉండ కూడదా ? వాళ్ళతోటి అయినా కబుర్లు కాలక్షేపం ఉంటాయి.కానీ అదేంటో ఒక స్త్రీ తోడు వేరు .అదీ భార్య స్తానంలో ఉండే స్త్రీ తోడు . అందుకేనేమో భగవంతుడు ఒక స్త్రీ ని ఒక పురుషుడుని సృ ష్టిం చాడు....స్త్రీ ని పిల్లల కోసం కదా ?సంతానానికి కదా ?...................................................................సంతానానికే అయితే భగవంతుడుపురుషుడినికూడా ఉపయోగించుకోగల సమర్ధుడు.
0 comments:
Post a Comment